HYD: స్టేషన్ నుంచి హరీష్ రావు విడుదల.. ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

HYD: స్టేషన్ నుంచి హరీష్ రావు విడుదల.. ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉదయం కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) నివాసం వద్ద హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కాలని చూస్తోందని అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan) నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌(FIR)లు నమోదు అవుతున్నాయని కీలక ఆరోపణలు చేశారు. పగ, ప్రతీకారాలతో సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి.. ఏడో గ్యారంటీ కింద రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సీఎంగా కాకుండా.. ఒక గల్లీ నాయకుడిలా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిర్భందాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి శాశ్వతం కాదని.. రాజ్యాంగం, చట్టాలే శాశ్వతమని అన్నారు. అది గుర్తుపెట్టుకొని పోలీసులు నడుచుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్‌లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారి పనిచేస్తున్నాయని అన్నారు.

Next Story