Caste census : 30న కులగణన పై గాంధీభవన్ లో సమావేశం

by Y. Venkata Narasimha Reddy |

కులగణన(Caste census)పై ఈ నెల 30న గాంధీభవన్ లో కీలక సమావేశం నిర్వహించాలని టీపీసీసీ(TPCC) నిర్ణయించింది.

Caste census : 30న కులగణన పై గాంధీభవన్ లో సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Caste census)పై ఈ నెల 30న గాంధీభవన్ లో కీలక సమావేశం నిర్వహించాలని టీపీసీసీ(TPCC) నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud) అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కుల గణన సమావేశంలో మంత్రులు, విప్ లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 4నుండి 19వరకు కుల గణన సర్వే నిర్వహించాలని, నవంబర్ 30వ తేదీ లోగా సర్వే పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.

అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టనున్న నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో(Rahul Gandhi meeting) సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని కు సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమాకారులతో నిర్వహించే ఈ సభకు రాహుల్ గాంధీని ముఖ్య అతిధిగా రావాలని టీపీసీసీ ఆహ్వానించింది. మహారాష్ట్ర , జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో వీలు చూసుకుని రాహుల్ గాంధీ చెప్పడంతో అందుకు సన్నాహకంగా 30వ తేదీన టీపీసీసీ కుల గణన సమావేశం నిర్వహిస్తుంది.

Next Story