- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఈ నెల 18న యాదాద్రికి ముగ్గురు సీఎంలు..
ఈ నెల 18వ తేదీన మూడు రాష్ట్రాల సీఎంలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18వ తేదీన మూడు రాష్ట్రాల సీఎంలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యాదాద్రికి వెళ్లనున్నారు. దీంతో యాదాద్రి బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు సీఎంల పర్యటన నేపథ్యంలో రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ యాదాద్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలాన్ని సీపీ పరిశీలించారు. కాగా, ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తొలి ఆవిర్భావ సభకు కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా రానున్న సంగతి తెలిసిందే.
Next Story






