మంటలు చెలరేగి ఓమ్ని వ్యాన్ దగ్ధం.. జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ప్రమాదం

by Ramesh Naini |

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గురువారం ప్రమాదవశాత్తు ఓమ్ని వ్యాన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

మంటలు చెలరేగి ఓమ్ని వ్యాన్ దగ్ధం.. జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గురువారం ప్రమాదవశాత్తు ఓమ్ని వ్యాన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై రైల్వేగేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉండగా వాహనం అకస్మాత్తుగా మొరాయించడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తుండగా మంటలు వ్యాపించాయి.

సీఎన్‌జీ వాహనం కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడి వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే వాహనం నుంచి దూరంగా వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Next Story