జనగణనలో కులగణన.. ఆహా ఏమి రుచి.. అమ్మో ఇదేం రేటు

by Naga Rani Yarlagadda |

కాస్ట్లీ మత్తు బాబులు ఇప్పుడు సాధారణ గంజాయి కన్నా ఓజీ గంజాయి (హైడ్రో ప్రోనిక్ గంజాయి)కి అలవాటు పడుతున్నారు. మత్తు దునియాలో ఓజీ గంజాయికి డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పుడు ఈ ఓజీ గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారని పోలీసులు గుర్తించారు.

జనగణనలో కులగణన.. ఆహా ఏమి రుచి.. అమ్మో ఇదేం రేటు
X

కాస్ట్లీ మత్తు బాబులు ఇప్పుడు సాధారణ గంజాయి కన్నా ఓజీ గంజాయి (హైడ్రో ప్రోనిక్ గంజాయి)కి అలవాటు పడుతున్నారు. మత్తు దునియాలో ఓజీ గంజాయికి డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పుడు ఈ ఓజీ గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారని పోలీసులు గుర్తించారు. సంపన్న వర్గాలకు చెందిన వారు, ఉన్నతవిద్యాభ్యాసం చేసిన వారందరూ ఈ ఓజీ గంజాయిని పీల్చడానికి పెద్ద మొత్తంలో డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు ఇటీవల హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలేంటి ఈ ఓజీ గంజాయి ? అందులో ఏం ఉంటుంది? తెలియాలంటే ఈ వార్తను పూర్తిగా చదవండి.

సమాచార కమిషనర్ల నియామకాల్లో ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని కొందరు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులో పలువురికి సంబంధించిన ఆధారాలను జత చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నియామకాలపై గవర్నర్ కూడా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఫైల్ ను సర్కారుకు తిరిగి పంపినట్లు చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటి? తెలియాలంటే పూర్తివార్త కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. కానీ కేంద్రం మాత్రం ఈ విధానం వల్ల దేశ ఐక్యత దెబ్బతింటుందని తోసిపుచ్చుతూ వచ్చింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం జనగణనలో కులగణనని చేస్తామని నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం. కులగణన రిపోర్టుకు అనుగుణంగా మండల కమిషన్ సూచించిన 40 సిఫార్సులను అమలు చేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుర్రునారాయణ యాదవ్ అన్నారు. కులగణనపై చాలా కాలంగా ఉన్న డిమాండ్ల గురించి ఆయనేం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి.. పూర్తి వార్తను చదవండి.

ఎండాకాలంలో ఎండలు దంచికొడతాయి. అడుగు బయటపెడితే సూరీడి ప్రతాపానికి దిమ్మ తిరగాల్సిందే. పేరుకి మండు వేసవి అయినా.. తీపి గుర్తుల్నెన్నో మిగిల్చి వెళ్తుంది. సీజన్లో వచ్చే స్పెషల్ పండ్లు, కూరగాయలతో అందరితో కలిసి భోజనం చేసే అనుభూతులెన్నో ఉంటాయి. వేసవిలో స్పెషల్ గా వచ్చే చింతచిగురుతో చేసిన వంటకాలు తింటే.. ఆహా ఏమి రుచి అనాల్సిందే. దానితోపాటు.. వాష్ పలాష్, జలంతోనే జీవనం.. మీకోసం.

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్దిరోజుల్లోనే భారత్ పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టింది. యుద్ధం చేయకపోయినా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై నిషేధం విధించింది. దీనివల్ల పాక్ కు వచ్చే నష్టమేంటి? భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఎగుమతులు దారుణంగా పడిపోనున్నాయా? పూర్తి వార్తకోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Next Story