- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: రేషన్ కార్డుల ఫైనల్ లిస్ట్ సిద్ధం చేసిన అధికారులు
ఈనెల 26 నుంచి తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డుల(Ration Cards) పంపిణీ జరుగనుంది. రేషన్‌కార్డుల ఫైనల్ లిస్ట్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 26 నుంచి తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డుల(Ration Cards) పంపిణీ జరుగనుంది. రేషన్‌కార్డుల ఫైనల్ లిస్ట్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేశారు. తొలి విడతలో కొత్తగా 3 లక్షల రేషన్‌కార్డులను ప్రభుత్వం జారీచేసింది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రకటన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)లు ఇప్పటికే స్పష్టం చేశారు.
మరోవైపు.. ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకం పొందాలన్నా రేషన్ కార్డే ప్రమాణికం అనే విషయం అందరికీ తెలిసిందే. పేదలకు గుర్తింపు కార్డుగా మారిన రేషన్ కార్డులను దాదాపు దశాబ్దకాలం పాటు కేసీఆర్(KCR) సర్కార్ అందజేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయబోతోంది. జిల్లా కలెక్టర్లు ఖారారు చేసిన జాబితా ప్రకారం పౌరసరఫరాల (Civil Supplies)శాఖ కార్డులను మంజూరు చేయనుంది.






