Sri Ram Navami: హైదరాబాద్‌లో ఊరేగింపు కొనసాగే ప్రాంతాలివే!

by Gantepaka Srikanth |

శ్రీరామ నవమి(Sri Ram Navami) వేళ హైదరాబాద్‌లో నిర్వహించే శోభాయాత్రపై జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sri Ram Navami: హైదరాబాద్‌లో ఊరేగింపు కొనసాగే ప్రాంతాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి(Sri Ram Navami) వేళ హైదరాబాద్‌లో నిర్వహించే శోభాయాత్రపై జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి శోభా యాత్ర సమీపిస్తోన్న వేళ హైదరాబాద్‌లోని సీతారామ్ బాగ్‌ ద్రౌపది గార్డెన్‌లో అన్ని శాఖల అధికారులతో సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న GHMC అడిషినల్ కమిషనర్ రఘు మాట్లాడుతూ.. శ్రీ రామనవమి శోభా యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోడ్ల మరమ్మతులకు, వీధి దీపాలకు, ఇతర వసతుల ఏర్పాట్ల కోసం ఇప్పటికే అధికారులందిరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.

అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఊరేగింపు(Procession) జరిగే రోడ్డును పరిశీలించారు. ఊరేగింపు - మంగళ్ హాట్ నుండి ప్రారంభమై వయా పురానాపూల్ గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్ గంజ్, గౌలిగుడ, కోటి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా, హనుమాన్ వ్యాయామ శాల గ్రౌండ్‌లో ముగుస్తుందని తెలిపారు.

Next Story