HYD: ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు

by Gantepaka Srikanth |

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అప్రమత్తం అయ్యారు.

HYD: ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు. శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తం అయింది.

Next Story