- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మాజీ మంత్రి కేటీఆర్ వాహనం తనిఖీ
మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అధికారులు తనిఖీలు నిర్వహించారు..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం తొలి విడుత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురికానివ్వకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లోకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వస్తువులు, మద్యం సీసాలు, నగదును సీజ్ చేస్తున్నారు.
అయితే సిరిసిల్ల నియోజకవర్గం(Sircilla Constituency) జిల్లెల గ్రామం(District village) వద్ద చేస్తున్న వాహన తనిఖీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Farmer Minister, Brush Working President Conspiracy) వెళ్తున్నారు. అయితే జిల్లెల గ్రామం వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనాన్ని పరిశీలించి సోదాలు చేశారు. ఏమీ లేకపోవడంతో తనిఖీలకు సహకరించినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.






