- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయండి: రైతులకు అధికారుల విజ్ఞప్తి
బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాను ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాను ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాలో రేపు (బుధవారం ఉదయానికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
తెలంగాణకు కూడా మొంథా తుఫాను తాకింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు అధికారులు రైతులకు కీలక సూచనలు ఇచ్చారు. మొంథా తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రెండు, మూడు రోజుల పాటు పంట కోతలు చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రైతులను కోరారు. మొంథా తుఫాన్ దృష్ట్యా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పంటల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంట కోతలను రైతులు 3 రోజులు వాయిదా వేయాలని సూచించారు. అలాగే ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) తెలిపారు. వివరాలు ఇవే..






