- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 5 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. ప్రత్యేక సమయాలు ప్రకటించిన అధికారులు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి 12 వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి 12 వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 93 పరీక్షా కేంద్రాలలో మొత్తం 31,542 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు), సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ అని రెండు పేపర్లు ఉంటాయి. వీటిని రెండు వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు.
పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుంచి విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా హాల్ టికెట్లను పొందవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే (24/7) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే విద్యార్థులు 040-23230942 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.






