- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బోనాలు వాయిదా.. దేవాదాయ శాఖ అధికారిక ప్రకటన
by Gantepaka Srikanth |
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక ప్రకటన చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక ప్రకటన చేశారు. ఈనెల 22వ తేదీన జరగాల్సిన వరంగల్ భద్రకాళి(Bhadrakali Temple) అమ్మవారి బోనాల ఉత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొందరి అభ్యంతరాల దృష్ట్యా బోనాలు(Bonalu) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కావాలనే పండుగ రోజున వివాదాలు సృష్టించి, రాజకీయాలకు ముడిపెడతారనే అనుమానం కలుగుతోంది. అందుకే వాయిదా వేయక తప్పడం లేదని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం బోనాలు నిర్వహించాలని అనుకున్నాం.. కానీ.. మాంసాహారంతో బోనాలు చేస్తారని కొందరు తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. పండుగ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని పేర్కొన్నారు.
Next Story






