- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందెశ్రీ మృతికి కారణం ఇదే.. డాక్టర్ల అధికార ప్రకటన
రాష్ట్ర గీత రచయిత, కవి, రచయిత అందెశ్రీ (64) అకాల మృతితో తెలంగాణ సాహిత్య రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర గీత రచయిత, కవి, రచయిత అందెశ్రీ (64) అకాల మృతితో తెలంగాణ సాహిత్య రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆయన మృతి వార్త తెలిసి సాహితీ వర్గాలు, కళారంగం, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే అందెశ్రీ మృతికి గల కారణాలపై గాంధీ ఆస్పత్రి వైద్యులు (Gandhi Hospital doctors) అధికారిక ప్రకటన (Official announcement) విడుదల చేశారు. హార్ట్ స్ట్రోక్‌తో అందెశ్రీ చనిపోయాడని, గత 15 ఏళ్లుగా అందెశ్రీకి హైపర్ టెన్షన్ ఉందని, మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నా.. అందెశ్రీ వైద్యులను సంప్రదించలేదని నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని, ఈ కారణంగానే ఈ రోజు ఉదయం ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు.
READ MORE ....
1994లోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందెశ్రీ.. ఎవరివల్ల బతికారంటే?






