- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ తెరపైకి ఓబులాపురం మైనింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన దోషులు
by Kema Shiva Kumar |
ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram Mining Case) మళ్లీ తెరపైకి వచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram Mining Case) మళ్లీ తెరపైకి వచ్చింది. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు (CBI Court) మే 6న మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చుతూ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో దోషులంతా శిక్షను అనుభవిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని, తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఇవాళ దోషులు బీవీ శ్రీనావాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, మెహాఫస్ అలీఖాన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణ తేదీలను మాత్రం కోర్టు ఇంకా వెల్లడించ లేదు.
Next Story






