- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో ఆటంకం.. ఏమైందంటే?
నగరవ్యాప్తంగా నేడు(శనివారం) భారీగా వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: నగరవ్యాప్తంగా నేడు(శనివారం) భారీగా వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు ఈరోజు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ క్రమంలో గణేశుడి ఊరేగింపు సందర్భంగా.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో ఇవాళ ఉదయం నుంచి వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
అయితే ఈ ఏడాది ఇప్పటివరకు 2 లక్షల వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భాగ్యనగరం వినాయక ఊరేగింపులో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే.. బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో ఆటంకం ఎదురైంది. రేకుల షెడ్డూ అడ్డు రావడంతో వినాయకుడి ఊరేగింపు వాహనం వీధిలో 30 నిమిషాల పాటు ఇరుక్కుపోయింది. దీంతో అడ్డుగా ఉన్న రేకుల షెడ్డూని సిబ్బంది తొలగించారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొంచెం ఆలస్యమయ్యే అవకాశముంది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఊరేగింపులో వరుస ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మండపం నుంచి బయలుదేరిన గణేష్ వాహనం ఒక్కసారిగా ఒకవైపు ఒరిగిపోవడంతో ఇరుకైన వీధుల్లో ముందుకు కదలడం కష్టంగా మారింది. రోడ్డుపై ఉన్న మెట్లు, ర్యాంపులను తొలగించేందుకు సిబ్బంది గంటపాటు తీవ్రంగా శ్రమించారు. ఈ సమస్యను అధిగమించి వాహనాన్ని ముందుకు కదిలించగలిగారు. కాగా, వేలం పాటలో ఎంతో ప్రత్యేకత ఉన్న బాలాపూర్ లడ్డూ. గత ఏడాది రూ.30,01,000పలికి బాలాపూర్ లడ్డూ ఈ సారి ఏ రికార్డు సృష్టిస్తోందో ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది.






