- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓబీసీ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి : మంత్రి పొన్నం
తెలంగాణలో బీసీలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీసీలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్‌లో కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణలో కుల గణన నిర్వహించినందుకు, బలహీన వర్గాల సంక్షేమానికి , అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఏఐసీసీ ఓబీసీ సెల్ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజకీయ, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి శాసనసభలో తీర్మానం చేశామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలోనే దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్‌ను యూపీలో బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ వాటాకు కేంద్రాన్ని నిలదీసేందుకు ఈ సదస్సును నిర్వహించినట్లుగా నిర్వహాకులు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పాలన, సామాజిక న్యాయానికి చేసిన కుల గణనపై నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.






