నర్సుల లైసెన్స్ రెన్యువల్‌కు ఊరట.. క్రెడిట్ అవర్స్ నుండి మినహాయింపు

by Ramesh Naini |

రాష్ట్రంలోని నర్సింగ్ ఆఫీసర్లకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) తీపి కబురు అందించింది.

నర్సుల లైసెన్స్ రెన్యువల్‌కు ఊరట.. క్రెడిట్ అవర్స్ నుండి మినహాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నర్సింగ్ ఆఫీసర్లకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) తీపి కబురు అందించింది. నర్సింగ్ రిజిస్ట్రేషన్ల రెన్యువల్ కోసం అవసరమైన 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (సీఎన్ఈ) క్రెడిట్ అవర్స్ నిబంధనలో కీలక మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఐఎన్సీ.. నర్సులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా 2026, డిసెంబర్ 31 వరకు సీఎన్ఈ క్రెడిట్ అవర్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపు పొందే అభ్యర్థులు ఏడాదిలోగా 120 గంటల వర్క్‌షాప్, శిక్షణ లేదా ఈ-లెర్నింగ్ పూర్తి చేస్తామని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

మొదటిసారి రిజిస్ట్రేషన్..

మొదటిసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకునే అభ్యర్థులు 5 ఏళ్ల లోపు దరఖాస్తు చేసుకుంటే వారికి 30 సీఎన్ఈ గంటలను కేటాయించాలని ఐఎన్సీ సూచించింది. సరైన ప్రమాణాలు ఉంటే, ఆసుపత్రులు, ఎన్.హెచ్.ఎం నిర్వహించే వర్క్‌షాప్‌లను కూడా సీఎన్ఈ కింద పరిగణించాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత నర్సింగ్ కౌన్సిల్ కార్యదర్శి కల్నల్ సర్వ జీత్ కౌర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని వేలాది మంది నర్సింగ్ అధికారులకు రెన్యువల్ ప్రక్రియలో పెద్ద ఉపశమనం లభించనుంది.

Next Story