హృదయ విదారకం.. రోడ్డుపక్కన కుప్పలుగా వానరాల కళేబరాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-24 00:59:54  IST  )

పల్లెల్లో వానరాలు (కోతులు) చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇళ్లల్లో ఏ ఆహారాన్నీ ..

హృదయ విదారకం.. రోడ్డుపక్కన కుప్పలుగా వానరాల కళేబరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లో వానరాలు (కోతులు) చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇళ్లల్లో ఏ ఆహారాన్నీ వదిలి పెట్టవు. వాటి బెడద పడలేక ఊరి నుంచి తరిమి కొట్టేందుకు రకరకాల పనులు చేస్తుంటారు. అడవుల్లోకి వానరాలను తరిమికొట్టేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. తొందపడి వాటిని చంపరు. కానీ.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ హృదయ విదారకమైన సంఘటన కనిపించింది. రోడ్డుపక్కన కుప్పలుగా వానరాల కళేబరాలు కనిపించాయి. పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులు 21 వానరాలు విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

వాటిని ఎవరో చంపి వాహనంలో తీసుకొచ్చి అక్కడ డంప్ చేసినట్లుగా తెలుస్తోంది. చనిపోయిన వానరాలను పరిశీలించగా కరెంట్ షాక్ కు గురైన ఆనవాళ్లు కనిపించాయి. ఒకేసారి అన్ని కోతులూ కరెంట్ షాక్ కు గురై చనిపోవడం అనుకోకుండా జరిగిన సంఘటనా లేక ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఏదేమైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారుల్ని కోరారు. కళేబరాలకు పూజలు చేసి గుంతలు తవ్వి పూడ్చి పెట్టారు.

Next Story