ఎన్టీఆర్ సంస్కరణలు చరిత్రలో నిలుస్తాయి: Nandamuri Balakrishna

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-18 04:19:47  IST  )

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ సంస్కరణలు చరిత్రలో నిలుస్తాయి: Nandamuri Balakrishna
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ రంగంలో, రాజకీయంలో ఎన్టీఆర్ తిరుగులేని శక్తిగా రాణించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పాలన సంస్కరణలు, సీఎంగా అయన అందించిన సేవలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. తెలుగోడి గుండెల్లో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకంగా చేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచారన్నారు.

Also Read....

NTR ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, kalyan Ram నివాళులు

Next Story