- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారకరత్న మృతదేహానికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ నివాళ్లు
తారకరత్న మృతదేహానికి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళ్లు అర్పించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తారకరత్న మృతదేహానికి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళ్లు అర్పించారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న పార్థివదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతికాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో ఉంచనున్నారు. కాగా, తారకరత్న మృతికి పలువురు ప్రముఖుల నివాళుల అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : ఆ కోరిక తీరకుండా తారకరత్న కన్నుమూయడం బాధాకరం: పవన్ కల్యాణ్
Next Story






