ఆ కోరిక తీరకుండా తారకరత్న కన్నుమూయడం బాధాకరం: పవన్ కల్యాణ్

by Disha Web Desk 2 |
ఆ కోరిక తీరకుండా తారకరత్న కన్నుమూయడం బాధాకరం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ నాయకులు, టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు. తాజాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తారకరత్న మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ''తారకరత్న కన్నమూయడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా. గత మూడు వారాలుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే.. ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరం. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తారకరత్న సతీమణికి, తండ్రి మోహన్ క‌ృష్ణకు, బాబాయ్ బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

తారకరత్న మృతదేహానికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ నివాళ్లు

వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న.. ఇప్పటికీ ఆయన పేరుమీదే!

Next Story

Most Viewed