- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: ఎన్టీఆర్ ఒక ప్రభంజనం : బాలకృష్ణ
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) ఒక ప్రభంజనం అని..దేశంలో నేటికి ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రాజకీయ, పాలన రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) కీర్తించారు.

దిశ, వెబ్ డెస్క్ : దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) ఒక ప్రభంజనం అని..దేశంలో నేటికి ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రాజకీయ, పాలన రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) కీర్తించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ధ నివాళులర్పించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయన్నారు.
టీడీపీ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారని..సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచే వారని గుర్తు చేశారు. తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమేనన్నారు. తన జీవితంలో సాధించిన విజయాలతో సినీ, రాజకీయ రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నరు.
నిరుపేదల ఆకలి తెలిసిన అన్న అయనే..ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యమిచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ అని..దేశంలో రాజకీయ విప్లవాన్ని..చైతన్యాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ కొనియాడారు.






