ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

by Kema Shiva Kumar |   (  Updated:2024-01-18 04:54:54  IST  )

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ ఒకే ఒక్కడని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ ఒకే ఒక్కడని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. టీడీపీని స్థాపించి నిరుపేదల సంక్షేమానికి అనేక సంక్షమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 2 రూపాలయకు కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపులు నింపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పేటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజారంజక పాలనను అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని, ఆయన నటన అనన్యసామాన్యమని కొనియాడారు.

Read More..

బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ NTR ఫ్లెక్సీల తొలగింపు కలకలం

Next Story