NTR: హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన జనరల్‌ లారా.. వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-09-16 13:54:44  IST  )

హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌లోకి తాజాగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ వచ్చారు.

NTR: హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన జనరల్‌ లారా.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (US Consulate Hyderabad)హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌లోకి తాజాగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ వచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా @USCGHyderabad హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ (US Consul General Laura Williams) ఫొటోలు షేర్‌ చేశారు. కాన్సులేట్‌లోకి ఎన్టీఆర్‌కు స్వాగతం. ఎన్టీఆర్ రాబోయే ప్రాజెక్ట్స్ కోసం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా- ఇండియా పార్టనర్ షిప్, జాబ్స్ క్రియేషన్స్, ఇరు దేశాల మధ్య బంధం బలపడనుందని యూస్ కాన్సుల్‌ జనరల్‌ లారా ఇ.విలియమ్స్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో అమెరికాలో జరుపుకోనుంది. ప్రశాంత్ నీల్ (Prashant Neel) సినిమా విషయంలోనే ఎన్టీఆర్ అమెరికా కాన్సులేట్‌‌‌లో పర్మిషన్ కోసం వెళ్లినట్లు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story