సింగరేణి నుండి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం

by Ajay Maddhiboyina |

సింగరేణి సంస్థ నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గాపూర్ లో ఉన్న ఎన్ఎస్పిసిఎల్ గురువారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది.

సింగరేణి నుండి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గాపూర్ లో ఉన్న ఎన్ఎస్పిసిఎల్ గురువారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు ఈడీ కోల్ మూమెంట్ ఎస్డీఎం సుభాని సమక్షంలో సింగరేణి జీఎం మార్కెటింగ్ ఎన్ వి. రాజశేఖర్ రావు, ఎన్ఎస్పిసిఎల్ సీఈవో దివాకర్ కౌశల్, జీఎంలు నీల్ కమల్, పలాష్ లు ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు.

ప్రముఖ జాతీయ బొగ్గు ఉత్పత్తి సంస్థ ఆయన ఎన్టీపీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ఎస్పిసిఎల్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గాపూర్ వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ బొగ్గును సరఫరా చేయనున్నారు. సింగరేణి సంస్థ నాణ్యత గల బొగ్గును తగిన పరిమాణంలో సకాలంలో అందజేస్తుందని, కనుక తాము ఈ కంపెనీ నుండి బొగ్గు కొనడానికి ముందుకు వచ్చామని ఎన్ఎస్పిసిఎల్ అధికారులు తెలియజేశారు . ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీనివాసరాజు, సురేందర్ రాజు పాల్గొన్నారు.

Next Story