ఇకపై ఒక్క స్కాన్ తో ఫిర్యాదు

by Muthe.Rajitha |

గ్రేటర్ హైదరాబాద్ లో బస్ షెల్టర్లలో సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇకపై ఒక్క స్కాన్ తో ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో బస్ షెల్టర్లలో సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బస్ షెల్టర్లలో చైర్లు, లైట్లు, ఫ్లోరింగ్, రూప్, డస్ట్ బిన్, బస్ స్టాట్ లో సైన్ బోర్డులు(లైట్లు లేకపోవడం), బస్ షెల్టర్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేకపోవడం వంటివాటిపై ఫిర్యాదు చేయడానికి బల్దియా నగరవాసులకు అవకాశం కల్పించింది. గ్రేటర్ లోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుమారు 1200 బస్ షెల్లర్లకు సంబంధించిన సమస్యలను అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశముంది. గతంలో అయితే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు, జోనల్, సర్కిల్ ఆఫీసులకెళ్లి ఫిర్యాదు చేసేవారు. ఒక్క స్కాన్ తో ఎక్కడి నుండైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదు జీహెచ్ఎంసీ అధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీకి కూడా వెళ్లనుంది. ఫిర్యాదు అందిన వెంటనే కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు వెళ్లి పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

సిటిజన్ క్లోజర్…

బస్ షెల్టర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కారం ఫిర్యాదు చేయడంతోపాటు ఆ సమస్యను పరిష్కారమైతే వెంటనే ఆ ఫిర్యాదులను క్లోజ్ చేసే బాధ్యత కూడా సదరు సిటిజన్ దే. ఫిర్యాదు ఆధారంగా పరిష్కారమైన అంశాన్ని ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

వారం రోజుల్లో ఏసీ బస్ షెల్టర్లు రెడీ

ఎండాకాలం నేపథ్యంలో ఏసీ బస్ షెల్టర్లను పునరుద్జరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యయా. వారం రోజుల్లో అందుబాటులో రానున్నాయని అధికారులు చెబుతున్నారు. కోట్లాది రూపాయాలతో గతప్రభుత్వం హయాలో 15 ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో ఒక్కటి కూడా అందులోబాటులో లేదు. ఖైరతాబాద్ జోన్ లో ఖైరతాబాద్, మెహిదీ పట్నం, ఎస్ ఆర్ నగర్, కోఠిలో ఏర్పాటు చేశారు. ,కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ప్లాటినం మాల్, సికింద్రాబాద్ జోన్ లో శివమ్ రోడ్, తార్నాక, బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చార్మినార్ జోన్ లో ఆరాం ఘర్,దిల్ సుఖ్ నగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో ఏసీ బస్ షెల్టర్లకు రిపేర్లు చేసి ఓపెన్ చేయనున్నారు.

Next Story