ఇక భగవంతుడి ఆదేశంతో ముందుకెళ్తా.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

గద్వాల (Gadwal) కాంగ్రెస్‌లో గందరగోళం, గ్రూపు రాజకీయాలపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక భగవంతుడి ఆదేశంతో ముందుకెళ్తా.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల (Gadwal) కాంగ్రెస్‌లో గందరగోళం, గ్రూపు రాజకీయాలపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ అధికారిక కార్యక్రమంలోనే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కాంగ్రెస్ నేతలతో పాటు తన ఫొటో పెట్టడంపై ఆయన స్పందించారు. ప్రోటోకాల్‌ (Protocol)లో భాగంగా పెట్టి ఉంటారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటే.. తన వద్ద ఎలాంటి సమాధానం లేదని బదులిచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తన నియోజవర్గ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని.. కానీ, ఆ పనులు ఏమాత్రం ముందుకు కదలడం లేదన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గద్వాలలో అభివృద్ధి పనులు జరగడం లేదని తెలిపారు. భవిష్యత్తులో భగవంతుడి ఆదేశానసారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా.. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకుంటారని ఆశిస్తున్నానని కృష్ణమోహన్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story