Good News: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్..1623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-08-22 14:19:27  IST  )

తెలంగాణ వైద్య విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది.

Good News: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్..1623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ (Medical students) వైద్య విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. ఈ మేరకు శుక్రవారం 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్ (specialist doctor posts) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (medical and health services recruitment board) నోటిఫికేషన్ విడుదల చేైసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగు అవనున్నాయి. మరోవైపు పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కానున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Next Story