- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ పీజీఈసెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
by Muthe.Rajitha |
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటించింది. మార్చి 17 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరిక్షల షెడ్యూల్, తదితర వివరాలను నోటిఫికేషన్ లో వివరించనున్నారు. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ పీజీఈసెట్) ర్యాంకు ఆధారంగా ఆయా కో్ర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మ్ డీ ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు http://pgecet.tgche.ac.in వెబ్సైట్ ను సంప్రదించాలని టీజీ పీజీఈసెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






