తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

by Gantepaka Srikanth |

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. మంగళశారం ఎన్నిక జరుగనుంది. బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్‌ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహిళల కోటాలో డీకే అరుణ ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమకూ అవకాశం ఇవ్వాలని రామచందర్‌ రావు, తల్లోజు ఆచారి అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి శోభా కరంద్లాజే ఆదివారం హైదరాబాద్‌ రానున్నారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యే నేతకు ఆదివారం సాయంత్రం లేదంటే సోమవారం ఉదయం సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీసీ నేత ఉండటం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే- ఈటల, లక్ష్మణ్, అర్వింద్‌లలో ఒకరికి ఛాన్స్‌ దక్కనుంది.

Next Story