- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్.. ఇంటికి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీప్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 20 లోపు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో A-1గా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకురావడంతో ఆయన దేశం దాటి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ప్రభాకర్‌రావును కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఒక వేళ హాజరుకాకుండా తప్పించుకుని తిరిగితే అఫెండర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అందించారు. ప్రభాకర్‌రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి వస్తారా లేక మరేదైనా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.






