ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత సహా 23 మందికికి నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2026-03-09 06:31:45  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ అయ్యాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత సహా 23 మందికికి నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‍పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులోప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది.

Next Story