సంచలన పరిణామం.. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్, ఈటల రాజేందర్‌కు నోటీసులు

by Malleboina Mahesh |   (  Updated:2025-05-20 08:35:31  IST  )

కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు.

సంచలన పరిణామం.. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్, ఈటల రాజేందర్‌కు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం కేసు (Kaleshwaram case)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు ఇచ్చింది. అలాగే మాజీ మంత్రి హారీష్ రావు (Former Minister Harish Rao), ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ (MP Etala Rajender) కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది.

ఈ విచారణ నివేదిక సమర్పణ కోసం కాళేశ్వరం కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, డిజైన్, నాణ్యత, ఆర్థిక, విధానపర అంశాలపై దృష్టి సారించింది. అయితే కేసీఆర్ (KCR) గతంలో నరసింహారెడ్డి కమిషన్ (Narasimha Reddy Commission) విచారణను న్యాయస్థానంలో సవాలు చేసి, దాని చైర్మన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఘోష్ కమిషన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Next Story