- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత రాజకీయాలను ప్రోత్సహించేది లేదు : బీజేపీ చీఫ్ రామచంద్రరావు
కాంగ్రెస్ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని మత రాజకీయాలకు తెరలేపిందని, వాటిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు(BJP chief Ramachandra Rao) వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని మత రాజకీయాలకు తెరలేపిందని, వాటిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు(BJP chief Ramachandra Rao) వెల్లడించారు. కాగా నేడు ఘట్‌కేసర్‌లోని ఔషాపూర్‌లో బిజెపి చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Election) పార్టీ విజయం కోసం ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలపాలని చూస్తోందన్నారు. ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య అన్నారు.
విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బిజెపి గతంలోనే వ్యతిరేకించిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయాల్లోనూ రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, ప్రజల కోసం మనందరం పోరాటం చేయాలన్నారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఓటు శాతం పెరుగుతోందని, ఇది మరింత పెరిగేలా బలమైన విశ్వాసంతో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.






