రేవంత్ పాలనలో రైజింగ్ కాదు, ఫాలింగ్.. ఇదే నిదర్శనం.. హరీష్ రావు సంచలన ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2025-04-18 12:49:36  IST  )

రేవంత్ పాలనలో తెలంగాణ రైసింగ్ (Telangana Raising) కాదు.. ఫాలింగ్ (Faling) అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఆరోపించారు.

రేవంత్ పాలనలో రైజింగ్ కాదు, ఫాలింగ్.. ఇదే నిదర్శనం.. హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ పాలనలో తెలంగాణ రైసింగ్ (Telangana Raising) కాదు.. ఫాలింగ్ (Faling) అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ క్షీణతపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై సంచలన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పడిపోతుండటం ఆందోళనకరమని అన్నారు. ఇటీవల విడుదలైన కాగ్ రిపోర్ట్ (CAG Report) ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (SOTR) 2023-24లో రూ. 1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గిందని తెలిపారు.

దీంతో ప్రభుత్వ ఆదాయంలో రూ. 91.81 కోట్ల తగ్గుదల నమోదైందని అన్నారు. కరోనా మహమ్మారి సమయం (Corona Time)లో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదని చెప్పారు. అంతేగాక 2014-15 నుండి 2022-23 వరకు బీఆర్ఎస్ పాలన (BRS Governance)లో తెలంగాణ 12 శాతం సీఏజీఆర్ (CAGR) తో సొంత పన్నుల ఆదాయ వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) వ్యాఖ్యానించారు.

Next Story