- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ కాదు, ఎన్నికల గాంధీ..! బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆయన పేరును ఎన్నికల గాంధీ (Election Gandhi)గా మార్చుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆయన పేరును ఎన్నికల గాంధీ (Election Gandhi)గా మార్చుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఎద్దేవా చేశారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కులగణన సర్వే రిపోర్టు (Caste Census Survey Report)ను తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రవేశపెట్టారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్, రాహుల్ గాంధీపై సంచలన విమర్శలు చేశారు. అబద్ధాలు (Lies)! హేయమైన అబద్ధాలు (Damn Lies)! అబద్ధాలు తప్ప మరేమీ లేవని (Nothing but lies)! అసెంబ్లీలో కులగణన రిపోర్టు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అలాగే నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు (Telangana People) రెండు విషయాలను స్పష్టం చేసిందని.. ఒకటి స్పష్టత లేని విధ్వంసకర ప్రభుత్వం, రెండవది బీసీ డిక్లరేషన్ (BC Decleration) పేరుతో మీరు సిగ్గులేకుండా చేస్తున్న అబద్ధాలు! అని మండిపడ్డారు. అంతేగాక బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందని ఆరోపించారు.
రిజర్వేషన్ల అంశంలో నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) యూ-టర్న్ (U-Turn) తీసుకున్నదని.. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని, దీంతో మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తుందని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ హామీలు, చెప్పిన వాగ్దానాలు (Promises), చేసిన ప్రకటనలు (Statements) అన్నీ బూటకం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. అబద్దాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ.. మీరు మీ పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ BC డిక్లరేషన్ 100 శాతం అబద్ధం అని, సర్కారు నిబద్ధత 100 శాతం ప్రహసనం! అని తేలిపోయిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.






