ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన పాలన : హరీష్ రావు

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.

ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన పాలన : హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇటీవలే రెండుసార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చేలా.. వాటిపై వ్యాట్ ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ ధరలో 35 శాతం, డీజిల్ ధరలో 27 శాతం స్టేట్ వ్యాట్ విధిస్తోందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ మాటలు చెప్పడం కాకుండా.. చేతల్లో పనులు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై వసూలు చేస్తున్న వ్యాట్ తో ప్రజలపై నెలకు రూ.162 కోట్లు, ఏటా రూ.2 వేల కోట్ల పన్నుల భారం పడుతోందన్నారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజలను పన్నులతో దండుకునే పాలన అని, ప్రజా పీడన పాలన అని విమర్శించారు. తమ సీఎంకు రాహుల్ గాంధీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తుచేయాలని సూచించారు. కాగా.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రూ.10 మేర తగ్గిస్తూ సోమవారం ఉదయం కీలక ప్రకటన చేసింది.

Next Story