- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు చూసేదంతా నిజం కాకపోవచ్చు! డీప్‌ఫేక్‌పై సీపీ సజ్జనార్ హెచ్చరిక
ఏఐ సాయంతో నిజంలాగా అనిపించే డీప్‌ఫేక్ వీడియోలను, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టిసిస్తున్నారని హైదారబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐ సాయంతో నిజంలాగా అనిపించే డీప్‌ఫేక్ వీడియోలను, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టిసిస్తున్నారని హైదారబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలను నిశితంగా గమనిస్తే లైటింగ్, నకిలీ ముఖ కవళికలు, కదలికల్లో అసహజత్వం సులువుగా తెలుస్తుందని అన్నారు. ఇలాంటి వీడియోల పట్ల మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి ఆ కంటెంట్ ఎక్కడిదో తెలుసుకోండి. ఉద్వేగానికి లోనై వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే.. సమాజంలో అశాంతికి కారణమయ్యే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన నేరంలో మీరూ భాగస్వాములు అవుతారని హెచ్చరించారు. అందుకే క్లిక్ చేసే ముందు ఆలోచించండి - నిర్ధారించుకోండి - ఆ తర్వాతే షేర్ చేయండని సూచించారు. ఈ డీప్‌ఫేక్‌ల యుగంలో మీ విమర్శనాత్మక ఆలోచనే మీకు అత్యుత్తమ రక్షణ.. అని ట్వీట్‌లో ఫోటోను పంచుకున్నారు.






