మహిళా ఓటర్లకు ముక్కు పుడకలు, చీరలు: జగన్‌పై బీటెక్ రవి సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను అధికార టీడీపీ (TDP)తో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

మహిళా ఓటర్లకు ముక్కు పుడకలు, చీరలు: జగన్‌పై బీటెక్ రవి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను అధికార టీడీపీ (TDP)తో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం సరిగ్గా 7 గంటలకు రెండు ప్రాంతాల్లో ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. పులివెందుల, ఒంటిమిట్ట సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఇప్పటికే కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy)తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి (Ramgopal Reddy), వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డి (Sathish Reddy)ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్‌పై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి భర్త పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి (BTech Ravi) సంచలన ఆరోపణలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పోలింగ్ కొనసాగుతోన్నా ఇప్పటికీ ఓటుకు రూ.5 వేలు చొప్పున డబ్బులు పంచుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లకు ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు అక్రమంగా ఆర్జించిన అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు.

Next Story