- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్క లేనిదే ముద్ద దిగదు! తెలంగాణలో నాన్‌వెజ్ ‘జోరు’ : ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదిక
ముక్క లేనిదే ముద్ద దిగదు అనే సామెత మరోసారి నిరుపితం అయింది. తెలంగాణ రాష్ట్రంలో మాంసాహార ప్రియుల సంఖ్యతో పాటు ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముక్క లేనిదే ముద్ద దిగదు అనే సామెత మరోసారి నిరుపితం అయింది. తెలంగాణ రాష్ట్రంలో మాంసాహార ప్రియుల సంఖ్యతో పాటు ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దశాబ్ద కాలంలోనే మాంసం వినియోగం ఐదింతలు పెరగడం గమనార్హం. తాజాగా రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (Socio-Economic Outlook) - 2026’ ఈ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మాంసం వినియోగం కేవలం 2.30 లక్షల టన్నులుగా ఉండగా, 2024-25 నాటికి అది ఏకంగా 11.01 లక్షల టన్నులకు చేరుకుంది.
దేశంలోనే టాప్..
పశుసంపద విషయంలో తెలంగాణ దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గొర్రెల సంఖ్య విషయంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. కోళ్ల పెంపకం, వినియోగంలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పశుసంపద విషయంలో 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్లకు పైగా పశుసంపద ఉంది. ఇక, పదేళ్ల క్రితం 1,006 కోట్లుగా ఉన్న గుడ్ల వినియోగం, ఇప్పుడు 1,935.26 కోట్లకు పెరిగింది. పాల వినియోగం కూడా 39.24 లక్షల టన్నుల నుంచి 59.35 లక్షల టన్నులకు వృద్ధి చెందింది. మొత్తానికి, అటు ఉత్పత్తిలోనూ, ఇటు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని సామాజిక ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తోంది.






