- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆమె’పై ఆగని హింస.. ప్రతి ఏడాది పెరుగుతోన్న క్రైమ్ రేట్
వరకట్న వేధింపులకు వివాహిత బలి.. మద్యానికి బానిసై భార్య, తల్లిని చంపిన కొడుకు.. మైనర్ పై గ్యాంగ్ రేప్.. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: వరకట్న వేధింపులకు వివాహిత బలి.. మద్యానికి బానిసై భార్య, తల్లిని చంపిన కొడుకు.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏడాదికేడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. 2024లో మహిళలపై జరిగిన నేరాలకుసంబంధించి 19,922 క్రిమినల్ కేసులు నమోదు కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.78 శాతం అధికం కావడం గమనార్హం. ఇందులో వరకట్న హత్యలు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటివి అధికంగా నమోదవుతున్నాయి. 2024లో 8,973 వరకట్న వేధింపుల కేసులు నమోదుయయ్యాయి. 2,945 లైంగిక దాడుల కేసులు, 241 హత్య కేసులు నమోదయ్యాయి. అయితే మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి భర్తలు, కన్నవాళ్లు, దగ్గరి బంధువులే ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, మహిళలపై నేరాలకు పాల్పడిన 51కేసుల్లో 70 మంది నిందితులకు కోర్టులు జీవితఖైదు విధించినట్లు రాష్ర్ట పోలీసు శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. 2024లో 940 లైంగిక దాడుల కేసుల్లో ఎనిమిది గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఐదేళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు
నేరం - 2020 - 2021 - 2022 - 2023 - 2024
వరకట్న హత్యలు - 42 - 33 - 40 - 33 - 22
వరకట్న మరణాలు - 44 160 126 132 126
ఆత్మహత్యకు ప్రేరేపించడం - 351 - 355 - 314 - 363 - 379
వరకట్న వేధింపులు - 6,544 - 8,429 - 9,071 - 9,458 - 8,973
హత్యల కేసులు ఇలా..
సంవత్సరం - హత్యలు
2020 - 161
2021 - 199
2022 - 181
2023 - 213
2024 - 241
లైంగిక దాడుల కేసులు ఇలా..
సంవత్సరం - నమోదైన కేసులు
2020 - 1,934
2021 - 2,382
2022 - 2,284
2023 - 2,293
2024 - 2,945
2024లో పదిహేనేళ్లలోపు బాలికలపై లైంగిక దాడులు : 87
15-18 ఏళ్లలోపు లైంగిక దాడులు: 1970
18 సంవత్సరాల కంటే ఎక్కువున్న వారిపై జరిగిన లైంగిక దాడులు: 888
షీ టీమ్ భరోసా - కేసులు
ఫిర్యాదులు : - 10,862
ఎఫ్ఐఆర్ లు : - 830
పిటీ కేసులు : - 3,369
కౌన్సెలింగ్ : - 15,664
మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి: రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్
రాష్ట్రంలో మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసులు లేరు. వేధింపులకు గురైన వారు తమ బాధను మగ పోలీసుల వద్ద చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. దీని కోసం జిల్లా కేంద్రాల్లోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. మహిళల హక్కులు, భద్రత, రక్షణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత కావాలి. మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలి.






