గవర్నర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్- 2025.. నామినేషన్ల గడువు పొడిగింపు

by Naga Rani Yarlagadda |

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాజ్ భవన్ కార్యాలయ వర్గాలు శనివారం ప్రకటన విడుదల చేశాయి.

గవర్నర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్- 2025.. నామినేషన్ల గడువు పొడిగింపు
X
  • నామినేషన్లు ఆహ్వానిస్తున్న రాజ్ భవన్

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాజ్ భవన్ కార్యాలయ వర్గాలు శనివారం ప్రకటన విడుదల చేశాయి. నాలుగు రంగాలలో రెండు విభాగాలుగా అవార్డు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతి అవార్డు రూ.2లక్షల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుందని తెలిపారు. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాన్తరోపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ రంగాలలో ఐదు సంవత్సరాలుగా సేవలందిస్తున్న వ్యక్తులు , సంస్థలు అర్హులుగా పేర్కోన్నారు. వ్యక్తిగత విభాగం, సంస్థల (సంఘాలు, ట్రస్ట్‌లు) విభాగాలలో అవార్డులు ఉంటాయిని తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ విధానం లేదా వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు పేర్కొన్నారు. దరఖాస్తు చేయాలనుకునే వారు https://governor.telangana.gov.in వెబ్ సైట్లో వివరాలు ఉన్నట్లు తెలిపారు. వ్యక్తి గతంగా పంపేవారు ప్రిన్సిపాల్ సెక్రటరీ టు గవర్నర్, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్ భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ 500041" కు పంపాలని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు వెబ్ సైట్ ద్వారా సబ్మిట్ చేయవచ్చని తెలిపారు. అవార్డులు 2026 జనవరి 26న గణతంత్ర దినేత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందజేయబడతాయి.

Next Story