- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ యువ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అద్భుతాలు చేశారని.. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు. రేవంత్ 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని.. మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించడం గొప్పవిషయమని చెప్పారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. విజన్ తెలంగాణ సక్సెస్ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యమేనని అన్నారు. నెహ్రూ, గాంధీజీల ఆశయ సాధనకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నదని.. తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్నదన్నారు. కళలు, టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా తెలంగాణ మారిందని కొనియాడారు.






