దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు ‘బీసీ’ ఆర్డినెన్స్.. నేటికీ అక్కడి నుంచి రాని పిలుపు!

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది.

దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు ‘బీసీ’ ఆర్డినెన్స్.. నేటికీ అక్కడి నుంచి రాని పిలుపు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇప్పటికే పంచాయతీరాజ్​చట్టం 2018కి సవరణ చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌‌ను ఆమోదం కోసం గవర్నర్‌ వద్దకు పంపింది. దాదాపు పదిరోజులు గడుస్తున్నా.. దానిపై రాజ్ భవన్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆర్డినెన్స్​కీలకం కావడంతో దానికి ఆమోదం లభిస్తే.. మిగిలిన ప్రక్రియ సులువు అవుతుందని పంచాయతీరాజ్​శాఖ అధికారులు భావిస్తున్నారు. గవర్నర్‌ను కలిసి ఈ ఆర్డినెన్స్​తీసుకువచ్చిన సందర్భంగా ప్రతిపాదించిన సవరణలను మరింత క్షుణ్ణంగా వివరించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాజ్ భవన్‌కు చేరవేశారు. సందేహాలను ముందే నివృత్తి చేయడం ద్వారా ఆర్డినెన్స్ తిరస్కరణకు గురికాకుండా ఉంటుందని, ఆమోదం విషయంలో ఆలస్యం కాదని అంచనా వేశారు. కానీ, ఇంత వరకు రాజ్‌భవన్​నుంచి పంచాయతీరాజ్​అధికారులకు ఎలాంటి పిలుపురాలేదు. పిలుపు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

న్యాయ నిపుణుల సలహాలు!

రిజర్వేషన్లు 50శాతానికి మించి పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇప్పుడున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయడం.. ఈ రెండు అంశాలే ప్రధాన లక్ష్యంగా పంచాయతీరాజ్​చట్టానికి తెలంగాణ సర్కారు సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ రెండింటి ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సలువు అవుతుంది. న్యాయపరంగా సైతం చిక్కులు రావని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అనుగుణంగా న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకొని ఆర్డినెన్స్‌ను రూపొందించినట్టు సమాచారం.

Next Story