TG: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణలో నో ట్రయాంగిల్ ఫైట్ అంతా డైరెక్టే!

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో త్రిముఖ పోటీకి బదులుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ స్పష్టంగా కనిపించింది. బీజేపీ అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమవ్వగా, పట్టణ ఓటర్ల ట్రెండ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

TG: మున్సిపల్ ఫలితాలు..  తెలంగాణలో నో ట్రయాంగిల్ ఫైట్ అంతా డైరెక్టే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే పట్టణ ప్రజలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టం అవుతోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఫలితాల్లో మాత్రం అందుకు భిన్నంగా మెజార్టీ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ ఉన్నట్లు వెల్లడవుతోంది. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. రూరల్ తెలంగాణతో పోలీస్తే పట్టణ ప్రాంతాల్లో తమకు బలమైన మద్దతు ఉందని ఎన్నికలకు ముందు అంచనా వేసుకుంది. మొత్తం 2,569 వార్డులకు పోలింగ్ జరుగగా ఇందులో ఇప్పటి వరకు 200 వార్డుల కంటే తక్కువ స్థానాల్లోనే బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో నగరాల్లోనూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి మొదలయ్యాయి. సీఎం చెప్పినట్లు ట్రయాంగిల్ కు బదులు మెజారిటీ స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే డైరెక్ట్ ఫైట్ కనిపించింది. బైంసా వంటి కీలకమైన మున్సిపాలిటీల్లో బీజేపీ అంచనాలు తలకిందులు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ ప్లేస్ పై చర్చ?
భవిష్యత్ తెలంగా తెలంగాణ రాజకీయాల్లో తామే సత్తాచాటుతామని చెబుతున్న బీజేపీకి ఈ ఫలితాలు మరోసారి చేదును మిగిల్చాయనే చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న కమలం పార్టీ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు అనేక మున్సిపాలిటీల్లో కనీసం ఖాతా తెరవకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అనే చర్చ తెరపైకి వస్తోంది.

మేము మెరుగుపడ్డాం:

ఈ ఫలితాలపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు స్పందించారు. ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన గతంతో పోలీస్తే ఈసారి మేము చాలా మెరుగుపడ్డామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చామని, తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించారన్నారు. కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని సంస్థాగతంగా బీజేపీ పలబడుతోందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారుతుంటే బీజేపీ ఓటు షేర్ పెరుగుతున్నదని చెప్పారు.
Next Story