- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమయం లేదు మిత్రమా! అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర సర్కారు దూకుడు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ సమీపిస్తున్న కొద్దీ సర్కార్ లో హడావుడి పెరుగుతున్నది.

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ సమీపిస్తున్న కొద్దీ సర్కార్‌లో హడావుడి పెరుగుతున్నది. 2018 ఎన్నికల నాటి హామీలను మళ్లీ తెరమీదికి తీసుకొచ్చి కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. స్కీమ్‌లను త్వరగా పూర్తిచేయాలని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నది. ఏప్రిల్ నుంచి సొంతింటి కల, పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ పథకాలను ప్రారంభించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. మరోవైపు వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల సాయం అందించేందుకు కసరత్తు షురూ చేసింది.
ఆగస్టు డెడ్ లైన్
ఏప్రిల్‌లో అన్ని ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ షురూ చేసి.. ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధికార పార్టీ భావిస్తున్నది. లేకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో అన్ని ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్‌కు చెందిన శాఖల అధికారులతో రివ్యూలు పెట్టారు. ముందుగా సొంతింట్టి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించే స్కీమ్ పై గైడ్ లైన్స్ తయారు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సర్కార్ ఆలోచన చేస్తున్నది. అలాగే రెండో విడత గొర్ల పంపిణీ ప్రారంభించేందుకు కసరత్తులో నిమగ్నమైంది. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి గొర్లను సేకరించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
ఒకేసారి పోడు పంపిణీకి..
ఇప్పటికే గుర్తించిన పోడు భూముల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని ఆధికారులను సర్కార్ ఆదేశించింది. ఇందుకు 1.55 లక్షల మందిని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పట్టాల పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో పోడు పంచాయితీ నడుస్తున్నది. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీకి నెగెటివ్‌గా ఉంది. దీన్ని అధిగమించేందుకు పెద్దఎత్తున పట్టాల పంపిణీ చేసే యోచనలో ఉంది.
బాధిత రైతుల గుర్తింపు
వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అగ్రికల్చర్, రెవెన్యూ సిబ్బంది కలిసి లెక్కలు తీస్తున్నారు. ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు చేరగానే బాధిత రైతుకు ఒక్కో ఎకరాకు పదివేల చొప్పున సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పక్రియ ఎప్పుడు మొదలు పెట్టాలనే దానిపై సీఎం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. అయితే వానాకాలం రైతుబంధు సాయం చేసేలోపు పంటనష్టం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.






