- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Prof. Kodandaram : చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ప్రజా సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)పై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం(MLC Prof. Kodandaram) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)పై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం(MLC Prof. Kodandaram) స్పష్టం చేశారు. కేవలం కేసీఆర్(KCR) విచారణకు హాజరైనందుకే కొందరు రాద్దాంతం చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. బుధవారం నాంపల్లిలోని టి.జె.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జనసమితి గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 'తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ కట్టిన కాలేశ్వరం కూలిపోయి అప్పు మాత్రం మిగిలింది అని అన్నారు. కమిషన్ ముందు హాజరై నిజాలు చెప్పడం కేసీఆర్ బాధ్యత' అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యలను వింటోందని, గత ప్రభుత్వంలో అలాంటి అవకాశం కూడా రాలేదని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సమస్యల పరిష్కారానికి నగర కమిటీ శ్రేణులు కృషి చేశారు. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జన సమితి మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.
ప్లీనరీ సమావేశానికి ముందుగా గోషామహల్ లో కోదండరాం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆచార్య జయశంకర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించి, అమరవీరులను స్మరిస్తూ కళాకారుల ఆటపాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు.






