కాళేశ్వరం అవినీతిపై పార్లమెంట్‍లో కేంద్రం కీలక సమాధానం

by Prasad Jukanti |   (  Updated:2026-03-30 13:24:26  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం అవినీతిపై పార్లమెంట్‍లో కేంద్రం కీలక సమాధానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని, కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం అని అన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు ఇవాళ ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వం ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు. జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పారు. తెలంగాణ వద్ద జల్ జీవన్ మిషన్ నిధులు రూ. 873 కోట్లు ఉన్నాయని వీటిలో నుంచి ఈ మూడేళ్లలో రూ. 194 కోట్లే ఖర్చు చేశారని హాట్ కామెంట్స్ చేశారు.

కొత్త ప్రతిపాదనలేవి రాలేదు:

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలేవీ అందలేదని సీఆర్ పాటిల్ వెల్లడించారు. 99 ప్రాజెక్టులలో 71 పనులు చాలా కాలంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను PMKSY-AIBP కింద చేర్చడం జరిగిందని వీటికి అర్హత కలిగిన కేంద్ర సహాయంగా రూ. 1,129.80 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 981.49 కోట్ల కేంద్ర సహాయం అందించిందని వెల్లడించారు.

Next Story