- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏమరపాటు అసలే వద్దు.. స్థానిక ఎన్నికలపై మంత్రి ఉత్తమ్, కోమటిరెడ్డి
స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. అధికార కాంగ్రెస్ (Congress) ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి సమీక్షలు నిర్వహిస్తూ.. స్థానిక ఎన్నికల్లో ఎలాగైన తిరుగులేని విజయం సాధించాలని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లోకల్ ఎలక్షన్లపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ పరంగా కూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలని సీఎంతో పాటు పీసీసీ చీఫ్‌కు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో క్లిన్ స్వీప్ కోసం ప్రయత్నించాలన్నారు. ఈ మాత్రం ఏమరపాటు తగదని.. ప్రతీ ఒక్కరి ఎఫర్ట్ స్థానిక ఎన్నికల్లో కనిపించాలని కామెంట్ చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలంగా సమన్వయం చేసుకుని మందుకు వెళ్లాలని అన్నారు.
దక్షిణ తెలంగాణలో క్లీన్‌స్వీప్ చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దక్షిణ తెలంగాణ (South Telangana)లో క్లీన్ స్వీప్ (Clean Sweep) చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ధీమా వ్యక్తి చేశారు. ఇవాళ పార్టీ జూమ్ మీటింగ్ పాల్గొన్నా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. కానీ, విపక్షం గట్టిగా ఉన్న ఉత్తర తెలంగాణపై ప్రస్తుతం దష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.






