ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యావిధానంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 11:29:43  IST  )

రాష్ట్ర విద్యావిధానంలో కీలక మార్పులు చేయబోతున్నామని, పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యావిధానంపై  సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందని, జాతీయ స్థాయి అధ్యనం తర్వాత రాష్ట్రంలోను విద్యావ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. ఇకపై SSC బోర్డు లేనట్టేనని పదోతరగతి పరీక్షలు ఉండబోవన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. విద్యావ్యవస్థలో మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని, విద్యావ్యవస్థలో మార్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు. మాది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని అన్న సీఎం బడ్జెట్‍కు వ్యతిరేకంగా చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల చెవిలో పువ్వులు కాదు వంగబెట్టి వీపుపై బండలు కట్టాలన్నారు. కేసీఆర్ బయటకి రాకుండా గృహ నిర్బంధం చేశారని, తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలన్నారు.

బీఆర్ఎస్ ట్రాప్‍లో గాంధీ మనువడు:

ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమని సీఎం స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నన్ను విచారణకి రమ్మని నోటీసు ఇస్తే వెళ్తానన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం మా ప్రణాళిక మాకు ఉందని చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడానికి మేం వ్యతిరేకం అని చెప్పారు. మూసీ విషయంలో ఆగేది లేదని నష్టపోయిన వారికి ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్ళానో లెక్క పెట్టిన వాళ్లు నేను ఎన్ని నిధులు తెచ్చానో లెక్కపెట్టాలన్నారు. గాంధీ మనుమడు కూడా ఒక పౌరుడే గాంధీ మనువడు బీఆర్ఎస్ ట్రాప్‍లో పడ్డాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లిన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6 వేల ఫోన్లు ట్యాప్ చేశారని 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీశ్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

బీజేపీ స్పందించదెందుకు?:

డ్రగ్స్ అంశంలో ఇంత జరుగుతుంటే బీజేపీ స్పందించడం లేదని బీఆర్ఎస్ వాళ్ళని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. నన్ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు చెప్పారు. జీవన్ రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్ చూసుకుంటుందన్నారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వానిదని తానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు.

Next Story